గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (21:51 IST)

పెళ్లి వాయిదా వేస్కోండి ప్లీజ్‌.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి

పాట్నా: కరోనా వ్యాప్తి చెందుతున్నా సోయి లేకుండా ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలు, విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ప్రజల తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. కొన్నాళ్లు పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్లు, సామూహిక కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కరోరారు.
 
నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన పది రోజుల లాక్‌డౌన్‌తో కరోనా చెయిన్‌ తెగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనాను తరిమివేసేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బిహార్‌లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.

వివాహాలకు 50 మంది అతిథులు హాజరు కావాలి. అంత్యక్రియల్లో 20 మందే పాల్గొనాలి. కిరాణా దుకాణాలు రోజు ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య తెరచి ఉంటున్నాయి. ఆ రాష్ట్రంలో రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.