గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (14:14 IST)

నేను పోలీస్‌ను... మీకేం భయం లేదు... ఎంజాయ్ చేయండి : హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

కర్నాటక రాష్ట్రంలో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ సెక్స్ రాకెట్‌ను ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్ నిర్వహించడం గమనార్హం. దీన్ని కర్నాటక పోలీసులు ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పర

కర్నాటక రాష్ట్రంలో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ సెక్స్ రాకెట్‌ను ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్ నిర్వహించడం గమనార్హం. దీన్ని కర్నాటక పోలీసులు ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిలీస్తే... 
 
కరిబసప్ప అనే హెడ్‌కానిస్టేబుల్... బెంగళూరు పరప్పణ అగ్రహార పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నారు. ఈయనకు వచ్చే ఆదాయం చాలక పోవడంతో ఇద్దరు వ్యభిచార బ్రోకర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. 
 
ఆ ఒప్పందం మేరకు హైటెక్ సెక్స్ రాకెట్‌ నిర్వహణకు తనవంతు పాత్రను అందిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మైకో లేఔట్‌లోని ఓ ఇండిపెండెంట్ హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సివిల్ డ్రెస్‌లో పోలీసులు దాడులు చేయగా అసలు విషయం బయటపడింది. 
 
ఈ వేశ్యాగృహంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ముగ్గురు యువతులతో పాటు స్వైపింగ్ మెషీన్లు, భారీ ఎత్తున నగదు లభ్యమయ్యాయి. దీని వెనుక హెడ్‌కానిస్టేబుల్ కరిబసప్ప హస్తం ఉండటంతో ఆయనను అరెస్టు చేసి.. విధుల నుంచి డిస్మిస్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.