బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:04 IST)

అత్యాచారం చేస్తుండగా ఏడ్చిందని.. నేలకేసి కొట్టిన రాక్షసుడు..

ఆడవారి పైనే కాదు అభంశుభం తెలియని పసికందులపై కూడా కొందరు కామాంధులు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. పది నెలల చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు.. తన వాంఛ తీర్చుకున్నాడు. అత్యాచారం సమయంలో ఏడుస్తున్న ఆ పసిపా

ఆడవారి పైనే కాదు అభంశుభం తెలియని పసికందులపై కూడా కొందరు కామాంధులు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. పది నెలల చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు.. తన వాంఛ తీర్చుకున్నాడు. అత్యాచారం సమయంలో ఏడుస్తున్న ఆ పసిపాపను స్పృహ కోల్పోయేలా నేలకేసి కొట్టి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీలోని వికాస్ పూరి ప్రాంతంలో తల్లి పక్కనే నిద్రిస్తున్న 10 నెలల పసికందును ఓ మానవ మృగం ఎత్తుకుని పక్క వీధిలో ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్‌లోకి తీసుకువెళ్లి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు... పాప కనిపించకపోవడంతో... ఆ తల్లిదండ్రులు పాపకోసం గాలిస్తున్నారు. 
 
ఇంతలో పాప ఏడుపు కేకలు వినిపించడంతో వారు వచ్చే సరికి ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడుతున్నాడు.. వెంటనే అతడిని అడ్డుకుని గొడ్డును బాధినట్టు బాదారు. అపస్మారక స్థితిలో ఉన్నబిడ్డను దగ్గరలోని హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆ కామాంధుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ కామాంధుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.