బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 31 జులై 2017 (02:33 IST)

ఆ కోటీశ్వరురాలు 21 ఏళ్ల నుంచి చీర కొనలేదు.. వదిలేశారు.. అంతే..

పది తరాలకు సరిపడా డబ్బు సంపాదించిన వారు కూడా జీవితంలో అత్యంత ఇష్టమైనవి త్యజించడం ఈ కాలంలో కూడా జరుగుతోందంటే నమ్మలేం. కానీ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి (ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య) దాన్ని అక్షరాలా రుజువు చేస్తున్నారు.

పది తరాలకు సరిపడా డబ్బు సంపాదించిన వారు కూడా జీవితంలో అత్యంత ఇష్టమైనవి త్యజించడం ఈ కాలంలో కూడా జరుగుతోందంటే నమ్మలేం. కానీ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి (ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య) దాన్ని అక్షరాలా రుజువు చేస్తున్నారు. దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి గత 21 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనలేదు. కారణం చాలా సింపుల్. తనకు ఎంతో ఇష్టమైన చీరల షాపింగును కాశీయాత్రలో వదిలేశారట. 
 
తన ఆహార్యంలో, మాటతీరులో  ఆర్భాటం చూపించని సుధామూర్తి 21 ఏళ్ల క్రితం చివరి సారిగా చీర కొనుక్కున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాశీ యాత్రలో తమకు ఇష్టమైనదాన్ని విశ్వేశ్వరుడికి అర్పించాలనేది భక్తుల నమ్మకం. దీంతో తనకు ఇష్టమైన చీరల షాపింగ్‌ను వదిలేసినట్లు సుధామూర్తి తెలిపారు. 
 
‘కాశీలో పవిత్ర స్నానానికి వెళ్లాం. అక్కడ మనకు నచ్చినదాన్ని త్యజించాలి. అందుకే నాకిష్టమైన చీరల షాపింగ్‌ను వదిలిపెట్టాను. ఇప్పుడు కేవలం అత్యవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పారు.
 
భక్తి భావనకున్న పాజిటివ్ భావన ఇదేనేమో. దేవుడిపై ఆనపెట్టి తనకు ఇష్టమైన దాన్ని దేన్నేయినా వదిలేయడం, తర్వాత దాన్ని పాటించడం ఈ దేశంలో కోట్లమంది పాటిస్తున్న ఆచారం. సుధామూర్తి సైతం అలాంటి ఆచారాన్ని నమ్మడం, పాటించడం నిజంగా గొప్పే. ఇలాంటి భక్తి ఇతరులను ఇబ్బంది పెట్టనంతవరకు భక్తితో ఎలాంటి గొడవ లేదు కదా. భక్తిని వ్యాపారం చేయడంతోనే తంటా అంతా.