భారత్ నా ఆత్మ.. తుదిశ్వాస వరకు ఇక్కేడ ఉంటా : సోనియా గాంధీ
భారత్ తనకు ఇల్లు మాత్రమే కాదు.. నా ఆత్మ అని.. తుది శ్వాస విడిచేంత వరకు ఇక్కడే ఉంటానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. పైగా.. భారత్‌పై తనకు ప్రేమ తగ్గలేదనీ, ఎన్నటికీ తగ్గదన్నారు.
దేశాన్ని ఓ కుదుపు కుదుపుతున్న అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సోనియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటలీ దేశస్థులే వారిని దోషులుగా మార్చారని పరోక్షంగా సోనియాను ఉద్దేశించి ప్రధాని మోడీ ఆరోపించారు.
వీటిపై సోనియా ఘాటుగానే స్పందించారు. భారత్ తన ఇల్లు, దేశమన్నారు. చివరి శ్వాసవరకూ భారత్‌లోనే ఉంటానన్నారు. దేశంపై తనకు ప్రేమ తగ్గలేదని స్పష్టం చేశారు.