గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 27 జులై 2017 (22:04 IST)

కమల్‌కు శ్రుతి హాసన్ సలహా... పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించడమంటే ఇదే...!!

కుటుంబ సభ్యుల మధ్య ఎంత గొడవలు ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం సర్దుకుపోతారు. అంతేకాదు తమవారు ఇబ్బంది పడే పరిస్థితే వస్తే వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పుడు తమిళ సినీపరిశ్రమలో జరుగుతోంది. తండ్రితో కమలహాసన్‌తో పొరపచ్చాలున్న శృత

కుటుంబ సభ్యుల మధ్య ఎంత గొడవలు ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం సర్దుకుపోతారు. అంతేకాదు తమవారు ఇబ్బంది పడే పరిస్థితే వస్తే వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదే ఇప్పుడు తమిళ సినీపరిశ్రమలో జరుగుతోంది. తండ్రితో కమలహాసన్‌తో పొరపచ్చాలున్న శృతిహాసన్ ఒక్కసారిగా ఆయన్ను కలిసింది. అదికూడా తండ్రి త్వరలో రాజకీయాల్లోకి వెళుతున్నారని తెలిసి ఆయన్ను వెళ్ళొద్దని చెప్పేందుకు వెళ్ళిందట. ఇప్పుడు ఈ విషయం కాస్త తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఆలస్యంగా మారుతుండటంతో కమల్‌ హాసన్ వెంటనే రాజకీయ రంగప్రవేశం చేయాలన్న ఆలోచనలో ఉన్న విషయం విదితమే. ఈ విషయం కాస్తా తమిళ మీడియాలో కోడై కూస్తోంది. ఏ క్షణమైనా కమల్ రాజకీయాల్లోకి వస్తారని, బిజెపితో కలవడం ఖాయమన్న వార్తలు వచ్చేస్తున్నాయి. అయితే కమల్ రాజకీయాల గురించి తెలుసుకున్న శృతి ఆయన్ను రాజకీయాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదట. 
 
ఇదే విషయాన్ని నేరుగా ఆమె తండ్రికి కలిసి చెప్పిందట. ఎప్పుడూ ఏ విషయాన్ని పట్టించుకోని శృతి హాసన్ ఒక్కసారిగా సలహా ఇవ్వడానికి వెళ్ళగా కమలే ఆశ్చర్యపోయారట. ఎంతయినా కుమార్తె కాబట్టి అలాగే అంటూ ఆమెను హర్ట్ చేయకుండా పంపేశారట. అయితే కమల్ కుమార్తె మాట వింటారా.. లేక అనుకున్న విధంగానే రాజకీయాల్లోకి వస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాగా శ్రుతి హాసన్ అంటే కిట్టనివారు... పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించడమంటే ఇదే అంటూ సైటైర్లు వేస్తున్నారట.