గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (08:37 IST)

భారత్ పై దాడికి ఉగ్రవాదుల కుట్ర!

బీజేపీతోపాటు.. ఆరెస్సెస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ వంటి సంస్థలకు చెందిన భారత ప్రముఖ నేతలను హత్య చేసేందుకు ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరించింది.

భారత్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు గురిపెట్టాయని, హిందూ జాతీయవాద సంస్థల నేతలను టార్గెట్‌గా చేసుకున్నాయని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

భారత్‌లో అలజడికి ఏదో ఒకటి చేయాలంటూ ఉగ్రవాద సంస్థలపై ఒత్తిడి ఉందని, దీంతో.. స్లీపర్‌సెల్స్‌, ఇస్లామిక్‌ స్టేట్‌(ఐస్‌), ఇతర ఉగ్రవాద సంస్థలు హిందూ జాతీయవాద సంస్థలనేతల దినచర్యలపై నిఘా పెట్టాయని పేర్కొంది.

అలాంటి నేతలను గుర్తించి, వారికి భద్రత పెంచాలని, ఉగ్రదాడుల అవకాశాలను వారికి వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతోనే 20 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు.