టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. రాజ్యానికి రాజు మాత్రమే: కర్ణాటక హైకోర్టు
టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్
టిప్పు సుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడు కాదని.. చరిత్రను బట్టి చూస్తే టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పేసింది. హైసొద్‌లూరుకు చెందిన మంజునాథ్ కేపీ(40) అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం నిర్వహించకుండా ఆదేశించాలని కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ జయంతిని ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారని చీఫ్ జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపు లాయర్ ఎంఆర్ నాయక్ తన వాదనలు వినిపిస్తూ టిప్పు సుల్తాన్ గొప్ప యోధుడని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడని, స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్లే జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
దీనికి చీఫ్ జస్టిస్ ముఖర్జీ స్పందిస్తూ.. తనకు తెలిసినంత వరకు టిప్పు సుల్తాన్ స్వాంతంత్ర్య సమరయోధుడు కాదని, అలాంటప్పుడు ఆయన జయంతిని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.