మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (18:13 IST)

ఉద్యోగంతో పాటు అన్నీవున్నా... సూసైడ్ చేసుకున్న లేడీ ఎస్ఐ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ లేడీ ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం ఉద్యోగంతో పాటు అన్నీవున్నప్పటికీ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌కు చెందిన కవితా సోలంకి అనే మహిళకు 35 సంవత్సరాలు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం చేస్తుంది. అన్నీ ఉన్నా ఆమెకు ఒకటే అసంతృప్తి. వయసు మీద పడుతున్నా ఆమెకు పెళ్లి సెట్ కావడం లేదు. 
 
స్నేహితులు, బంధువులు పెళ్లి గురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతోంది. దీంతో డిప్రెషన్‌కు గురైన కవిత ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇంటి నుంచి వచ్చి బుధవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయిన కవిత కొంత సేపటికి విషం తాగేసింది. ఆ విషయాన్ని తన సహోద్యోగులకు చెప్పింది. వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స తీసుకుంటూ మధ్యలోనే ఆమె మరణించింది. 
 
విషం తాగే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు వెల్లడించారు. 'వయసు దాటిపోతున్నా పెళ్లి జరగడం లేదని ఆమె డిప్రెషన్‌కు గురైంది. స్నేహితులు, బంధువులు పెళ్లి గురించి వేసే ప్రశ్నలు ఆమెకు మరింత అసహనం కలిగించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంద'ని ఎస్పీ గౌరవ్ తివారి తెలిపారు.