శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (22:06 IST)

మోడీ విద్యార్హతల సర్టిఫికేట్లు ముమ్మాటికీ నకిలీవే : ఆప్ ఎదురుదాడి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హత వివాదం మరింత ముదిరిపాకాన పడేలా ఉంది. ప్రధానికి చెందిన బీఏ, ఎంఏ డిగ్రీ పట్టాలను అమిత్‌షా, అరుణ్ జైట్లీ సోమవారం మీడియాకు విడుదల చేసిన కొద్ది సేపటికే ఆప్ స్పందించింది. 
 
ఆప్ నేత అశుతోష్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు విడుదల చేసిన ప్రధాని విద్యార్హతల సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవేనని, అవి ఫోర్జరీ సర్టిఫికేట్లని ఆరోపించారు. 
 
బీఏ, ఎంఏ రెండు సర్టిఫికెట్లలోనూ ప్రధాని పేరు వేర్వేరుగా ఉందన్నారు. ప్రధాని బీఏ మార్క్‌షీట్‌లో ఆయన గ్యాడ్యుయేషన్ చేసిన సంవత్సరానికి, డిగ్రీ సర్టిఫికెట్‌లో ఉన్న సంవత్సరానికి కూడా తేడా ఉందన్నారు.