బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (17:05 IST)

జంతు వధశాలల మూసివేతకు సీఎం యోగి ఆదేశం.. మహ్మద్ కైఫ్ అభినందనలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచించాలని ఆయన అధికారులను కోరారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధించారు. తాను జారీ చేస్తోన్న‌ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆయ‌న‌ తేల్చిచెప్పారు. 
 
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీలో హిందూత్వ నేతగా విశేష గుర్తింపు పొందిన ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షించారు. 
 
అలహాబాద్‌కి చెందిన మహ్మద్ కైఫ్ ట్విటర్లో స్పందిస్తూ.. "ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై అప్పటికప్పుడే అనుమానాలు వ్యక్తం చేసేకంటే.. వారికి  శుభాకాంక్షలు చెప్పడం మంచిది. వారి హయాంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, "యోగి ఆదిత్యనాథ్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆయన పాలనలో యూపీ అభివృద్ధి సాధించాలని, ప్రజలకు ఆయన గొప్ప భవిష్యత్తును ఇస్తారని ఆకాంక్షిస్తున్నా..." అని తెలిపాడు.