ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (22:38 IST)

01-03-2019 నుండి 31-03-2019 వరకు మీ మాస రాశిఫలితాలు(Video)

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అన్నిరంగాల వారికి యోగదాయకమే. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలుగుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతానం భవిష్యత్తును వారి ఇష్టానికి వదిలేయండి. పనులు సానుకూలమవుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించే ఆస్కారం ఉంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. దైవకార్యాలకు సాయం అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సభ్యత్వాలు, పదవులు దక్కకపోవచ్చు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. దైవకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభాశుభ మిశ్రమాల సమ్మేళనం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆహ్వానాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. బంధుత్వాలు బలపడుతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. దస్త్రం వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు పదోన్నతి, బాధ్యతల మార్పు. దైవకార్యం, వేడుకల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. ఖర్చులు విపరీతం. దైవకార్యం, అవసరాలకు బాగా వ్యయం చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి వహించండి. ఆహ్వానం అందుకుంటారు. నగలు, నగదు జాగ్రత్త. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వస్త్ర, పచారీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. జూదాలు, పందేల జోలికి పోవద్దు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. పొదుపు ధనం అందుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు.  
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూల ప్రతికూలతల సమ్మేళనం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. కొత్త అధికారులతో సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దస్త్రం వేడుకలు ప్రశాంతంగా సాగుతుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతికి అని విషయాలు తెలియజేయండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా వ్యవహరించాలి. ప్రియతములను కలుసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు, చికాకులు అధికం. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. గృహంల ప్రశాంతత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. శుభకార్యానికి హాజరవుతాయి. మీ రాక ఆప్తులకు సంతోషాన్నిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక అయిన వారికి సంతృప్తినిస్తుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. వేడుకలు, శుభకార్యాన్ని ఆడంబరంగా పూర్తిచేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపకాలు, పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ధనప్రలోభం, ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతితో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.