సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (13:35 IST)

కలలో ఎక్కువ పాములు కనిపిస్తున్నాయా? సర్పదోషాలకు ఇలా చేయండి

నరదృష్టితో నల్లరాళ్లు బద్ధలవుతాయని పెద్దలంటారు. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే.. రాహు దోషాలున్నవారు, కుజ దోషాలున్నవారు, శత్రుభయం కలిగివున్నవారు.. వివాహంలో జాప్యం, సంతానలేమితో ఇబ్బంది పడుతున్నవారు.. ఆదివా

నరదృష్టితో నల్లరాళ్లు బద్ధలవుతాయని పెద్దలంటారు. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే.. రాహు దోషాలున్నవారు, కుజ దోషాలున్నవారు, శత్రుభయం కలిగివున్నవారు.. వివాహంలో జాప్యం, సంతానలేమితో ఇబ్బంది పడుతున్నవారు.. ఆదివారం సాయంత్రం.. 4.30 నుంచి 6.00 వరకు, సోమవారం ఉదయం 7.30 నుంచి 9.00 వరకు, శనివారం ఉదయం 9.30 నుండి 11.00 వరకు రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమాలిక తైలంతోగాని, నవమూలిక తైలంతోగాని లేదా నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసినట్లైతే విశేష ఫలితాలుంటాయి. ఈ సమయంలో దుర్గాఅష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయడం ద్వారా దోషాలు, దృష్టి కారకాలు తొలగిపోతాయి. 
 
ఎన్ని సంబంధాలు చూసినా వివాహము కాని అమ్మాయిలు 41 రోజులు పార్వతీ దేవిని ఎర్రని పువ్వులు (మందారం- కనకాంబరాలతో) గాని అష్టోత్తర శతకముతో పూజ చేయించండి. లేదా ఏడు మంగళవారాలు శ్రీకాత్యాయనీ వ్రతము చేయండి. 
 
సర్పదోషాలు వున్నవారు కలలో ఎక్కువగా సర్పములు కనిపించే వారు నాగసిందూరం వాడటం చాలా మంచిది. నవమూలికా తైలం దీపారాధనకు రాహుకాలములో సోమవారం, శనివారం వాడటం చాలా మంచిదని పంచాంగ నిపుణులు అంటున్నారు.