సంబంధిత వార్తలు
- సుదర్శన గాయత్రీ మంత్రం: 108 సార్లు శనివారం జపిస్తే?
- మంచు విష్ణు కలల ప్రాజెక్టు "కన్నప్ప"లో ప్రభాస్?
- ప్రేమపెళ్లికి శివుడు కనికరించలేదు.. అంతే శివలింగాన్ని దాచేశాడు..
- శివునికి, కుమార స్వామికి 11 వారాల పాటు.. ఎర్ర గులాబీలను..?
- 'నేను పరమశివుడిని... నిన్ను చంపి మళ్లీ బతికిస్తా'నంటూ 70 యేళ్ళ వృద్ధుడి ఘాతుకం
బుధవారం ప్రదోషం శివదర్శనం- బుద్ధికుశలతతో కూడిన సంతానం..?
బుధవారం ప్రదోషం.. బుద్ధికుశలతతో కూడిన సంతానం కోసం సాయంత్రం పూట శివ దర్శనం చేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బుధవారం ప్రదోష వేళలో శివాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే.. సంతానం బుద్ధికుశలతో కూడిన వారై ఎదుగుతారు.
బుధవారం నాడు వచ్చే ప్రదోషం రోజు శివుడి దర్శనం సంపదను ఆకర్షిస్తుంది. ఈ రోజు వ్రతం ఆచరించి.. అభిషేకాని చేతనైన పదార్థాలు లేదా వస్తువులు తీసివ్వడం చేయాలి. అలాగే ప్రదోష సమయంలో శివ దర్శనం చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు వుండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
బుధవారం ప్రదోష ప్రయోజనాలు:
బుధవారం నాడు వస్తున్న ప్రదోషం రోజున సాయంత్రం శివుని ఆలయానికి వెళ్లి పూజించడం, అభిషేకానికి వస్తువులను అందించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
సాయంత్రం శివాలయంలో 'ఓం నమ శివాయ" అనే మంత్రాన్ని తూర్పు దిశలో కూర్చుంటూ 108 సార్లు ఉచ్ఛరించాలి. ఈ పంచాక్షరీ మంత్ర పఠనంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
ప్రదోష వేళలో జరిగే అభిషేకాదులను కళ్లారా వీక్షిస్తే కోటి జన్మల పుణ్యం చేకూరుతుంది. నందీశ్వరునికి గరిక మాలను సమర్పించడం ద్వారా జీవితంలో ఉన్నతి లభిస్తుంది.
తర్వాతి కథనం
