గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (22:18 IST)

ప్రేమపెళ్లికి శివుడు కనికరించలేదు.. అంతే శివలింగాన్ని దాచేశాడు..

Lord shiva
శివుడు తన మొర ఆలకించలేదనే కోపంతో.. శివలింగాన్ని ఎత్తుకెళ్లి పొదల్లో దాచాడు ఓ వ్యక్తి. కానీ  పోలీసులకు చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన ఛోటూ(27) అనే యువకుడు ఓ స్థానిక యువతిపై మనసు పడ్డాడు. 
 
ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ వారి కుటుంబం అంగీకరించకపోవడంతో ఇక లాభం లేదని ఆమెను వివాహం చేసుకునేందుకు శివుడికి నిష్ఠతో ప్రార్థించాడు. దీంతో, శివుడు తన మొరాలకించలేదని కోపం పెంచుకున్న అతడు శివలింగాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని పొదల్లో దాచేశాడు. 
 
అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఛోటూను అరెస్ట్ చేశారు. అతడు పొదల్లో దాచిన శివలింగాన్ని పోలీసులు గుర్తించగా గ్రామస్థులు గుళ్లో మళ్లీ ప్రతిష్టించారు.