ఆరు దేశాల్లో స్పై థ్రిల్లర్ హిట్ మ్యాన్ చిత్రీకరణ
గాయాలతో బాధపడుతున్న హీరో అద్దంలో తనని తాను చూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. మనసులో దేని గురించో బాధపడుతుంటాడు. కానీ దాన్ని బయటకు కనిపించనీయడు. ఏదో గుర్తుకు రావటంతో స్టైలిష్ గా తయారై తన గదిలోకి వెళతాడు. అక్కడున్న ఆయుధాల్లో విల్లుని ఎంపిక చేసుకుంటాడు. వెనక్కి చూసి లక్ష్యాన్ని గురి పెట్టి చేదిస్తాడు. ఇంతకీ మన హీరో దేని కోసం అంతలా ఆలోచిస్తుంటాడు.. తన లక్ష్యం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే నవంబర్‌లో విడుదల కాబోతున్న హిట్ మ్యాన్ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
99 సినిమాస్ బ్యానర్‌పై బిష్ణు అధికారి, అదితి శర్మ, ఆంచల్ శర్మ హీరో హీరోయిన్లుగా బిష్ణు దర్శకత్వంలో దీపక్ అధికారి నిర్మిస్తోన్న స్పై థ్రిల్లర్ హిట్ మ్యాన్. ఈ సినిమా నవంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ బిష్ణు అధికారి మాట్లాడుతూ* 'హిట్ మ్యాన్' ఒక స్పై థ్రిల్లర్. దీనికి స్క్రిప్ట్ నేనే రాసి డైరెక్ట్ చేయటంతో పాటు హీరోగానూ నటించాను. న్యూ ఏజ్ మూవీ. బూర్జ్ ఖలీఫాలో సినిమా షూటింగ్ చేశాం. పారిస్, దుబాయ్, ఆమ్స్టర్డ్యామ్, నేపాల్, శ్రీలంక, మన దేశం..ఇలా 6 వేర్వేరు దేశాల్లో సినిమాను చిత్రీకరించాం. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. ఛాప్టర్ 1 నవంబర్ లో రిలీజ్ కానుంది. నేను మార్వల్ సినిమాలకు పెద్ద అభిమానిని. అదే స్టైల్లో నేను కొత్తగా ఓ స్పై థ్రిల్లర్ కథను చెప్పటానికి ప్రయత్నించాను. రాంబో సినిమా తర్వాత విల్లు, బాణాలతో కూడిన యాక్షన్ మూవీ మరోటి రాలేదు. కానీ ఈ సినిమాలో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ఛాప్టర్ 1కి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మంచి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్వీస్ టెక్నాలజీ ఉన్నట్లు ఈ సినిమాలో ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హిందీలోనూ రిలీజ్ చేయటానికి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ* హిట్ మ్యాన్టీజర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. బిష్ణు చేస్తోన్న తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
*డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ* రోహిత్, సన్ని, మంత్ర ఆనంద్, హీరో అండ్ డైరెక్టర్ బిష్ణు సహా అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి సినిమా చేయటం ఎంతో కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేయటం విశేషం. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
*మంత్ర ఆనంద్ మాట్లాడుతూ* మా హిట్ మ్యాన్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న వారికి థాంక్స్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాయి. మూడు పాటలు, మ్యూజిక్ థీమ్స్ ఉన్నాయి. న్యూ ఏజ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. యాక్షన్ సీక్వెన్సులు ఇంటర్నేషనల్ స్టాండర్స్‌లో ఉంటాయి. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రానుంది అన్నారు.
*కో ప్రొడ్యూసర్ సిప్రా మిశ్రా మాట్లాడుతూ* బిష్ణు మాకు మంచి స్నేహితుడు. మా తొలి ప్రయత్నం. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. రెండేళ్ల ముందు మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఔట్ పుట్ చూశాక చాలా హ్యాపీగా ఉంది" అన్నారు.