సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (10:23 IST)

అలా చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట...

సాధారణంగా ఎరుపు రంగు అంటే చాలా మందికి ఇష్టపడరు. మరికొందరైతే ఎరువురంగు అంటే అమితంగా లైక్ చేస్తారు. ఎరువు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి 10 మందిలో నిలబడినా ఇట్టే గుర్తించవచ్చు. పైగా బాగా ఆకర్షించబడతాడు క

సాధారణంగా ఎరుపు రంగు అంటే చాలా మందికి ఇష్టపడరు. మరికొందరైతే ఎరువురంగు అంటే అమితంగా లైక్ చేస్తారు. ఎరువు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి 10 మందిలో నిలబడినా ఇట్టే గుర్తించవచ్చు. పైగా బాగా ఆకర్షించబడతాడు కూడా. అదే ఎరుపు రంగుకు ఉన్న ప్రత్యేకత.
 
ఈ విషయాన్ని పక్కనబెడితే అమ్మాయిల్ని ఆకర్షించడానికి అబ్బాయిలు నానా ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే ఖరీదైన నగలు, బైకులు ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరికొందరైతే అమ్మాయిలకి చాక్లెట్లు, పూలు, గిఫ్టులు ఇచ్చి కాకా పట్టాలని ట్రై చేస్తుంటారు. అప్పటికీ అమ్మాయిలను పడేయడం చాలా కష్టం. 
 
అయితే, తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు ప్రత్యేకించి ఎలాంటి పాట్లు పడక్కర్లేదని చెబుతున్నారు. అమ్మాయిలను ఆకర్షించాలంటే ఎర్రటి దుస్తులు వేసుకుంటే చాలని కొత్తగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
 
"స్త్రీలకు ఎరుపు రంగు అంటే ఓ శృంగారభరితమైన ఆలోచన" అని రోచెస్టర్, మునిచ్ కళాశాలలకు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త ఆండ్రూ ఎల్లియోట్ తెలిపారు. అంతేకాకుండా తమ పరిశోధనలో ఎరుపు రంగు, శృంగారం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్లు కూడా ఆయన అన్నారు.