శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (11:51 IST)

ట్విట్టర్ - ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన భారతీయ రైల్వే!

ప్రజలతో మరింత దగ్గరగా అనుసంధానం కావడానికి సామాజిక సమాచారం అనుసంధాన సాధనాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను భారతీయ రైల్వే ప్రారంభించింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.
 
కాగా, మంగళవారం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు. 
 
మరోవైపు.. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.