నయనతార హ్యాపీగా ఉండాలి: మాజీ లవర్ శింబు.. ఎందుకలా చెప్పాడు?!
మాజీ ప్రేయసి గురించి మాట్లాడేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ శింబు తన మాజీ లవర్ నయనతార గురించి నవ్వుతూ మాట్లాడారు. ప్రభుదేవా ఎంట్రీ ఇవ్వడంతో శింబు-నయనతార లవ్వాయణం బ్రేకప్ అయ్యింది. ఆపై ప్రభుదేవా-నయన ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది. అయినప్పటికీ శింబు నయనతార బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసి ఓ సినిమా చేశారు. రొమాన్స్ పండించారు.
ఐతే శింబు ఓ అడుగు ముందుకేశాడు. తన మాజీ ప్రేయసి కొత్త ప్రేమాయణం గురించి ఓ మీడియా సమావేశంలో మొహమాటం లేకుండా స్పందించాడు. తన కొత్త సినిమా ‘వాలు’ విజయోత్సవంలో భాగంగా శింబు ప్రెస్ మీట్ పెట్టగా.. డైరెక్టర్ విఘ్నేష్‌తో నయనతార ప్రేమాయణం గురించి మీరేమంటారు అంటూ శింబును సూటిగా ప్రశ్నించాడు ఓ విలేకరి. శింబు నో కామెంట్ అని తప్పించుకోకుండా దీనికి నవ్వుతూ సమాధానమిచ్చాడు.
‘‘నయన్ ప్రస్తుతం ఇలాంటి రిలేషన్ షిప్లో ఉందని నేను నమ్మడం లేదు. ఒక వేళ మీరు అన్నదే నిజమైతే ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను’’ అని బదులిచ్చి ఆశ్చర్యపరిచాడు శింబు. కాగా శింబు-నయనతారల ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
కానీ నయన శింబుకు టాటా చెప్పేసి ప్రభుదేవా లవ్వాయణం కొనసాగించింది. అది కూడా బ్రేకప్ అయ్యింది. ఇటు శింబు-హన్సికల చిగురించిన లవ్వాయణానికి కూడా బ్రేక్ పడంది. ప్రస్తుతానికి శింబు-నయనతార సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు.