శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By ivr
Last Modified: సోమవారం, 19 డిశెంబరు 2016 (17:06 IST)

కాంట్రవర్సీ 'కింగ్' ట్రంప్... అయినా గెలిచాడు ఎందుకని?

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోయే ట్రంప్ పైన విమర్శలు అన్నీఇన్నీ కావు. గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 'మొదట్లో మీరు నిర్లక్ష్యానికి గురవుతారు. ఆ తర్వాత ఎగతాళిని, పోరాటాన్ని ఎదుర్కొంటారు. చివరికి మీరే

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోయే ట్రంప్ పైన విమర్శలు అన్నీఇన్నీ కావు. గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అప్పట్లో  చర్చనీయాంశంగా మారింది. 'మొదట్లో మీరు నిర్లక్ష్యానికి గురవుతారు. ఆ తర్వాత ఎగతాళిని, పోరాటాన్ని ఎదుర్కొంటారు. చివరికి మీరే విజయం సాధిస్తారు' ఈ మాటలను మహాత్మా గాంధీ చెప్పారని డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సూక్తితో పాటు ఆయన ప్రచార సభలకు భారీ ఎత్తున జనం తరలి వస్తున్నట్లు చూపించే ఫొటోను కూడా పెట్టారు. అయితే, ఈ సూక్తిని గాంధీ చెప్పారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా మీడియా స్పష్టం చేసింది. దీంతో పలువురు ఆయన్ను సోషల్‌మీడియా వేదికగా విమర్శించారు. ఆ సూక్తి.. గాంధీ చెప్పకపోయినప్పటికీ చాలా సార్లు ఆ సూక్తిని ఆయనకు ఆపాదించారంటూ యూఎస్‌ పొలిటికల్‌ వెబ్‌సైట్‌ ఒకటి పేర్కొంది.
 
ట్రంప్ వ్యాఖ్యలపై మండుతూ నగ్న విగ్రహాలు...
ట్రంప్‌ మహిళలు, ముస్లింలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కొంప ముంచేశాయి. అంతేగాకుండా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో  సహనాన్ని పరీక్షిస్తున్న ట్రంప్‌పై వ్యతిరేకత పెల్లుబుకింది. దాంతో నిలువెత్తు ట్రంప్ నగ్న విగ్రహం వీధిలో దర్శనమిచ్చింది. ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ వైఖరికి నిరసనగానే ఈ పనిచేసినట్లు ''ఇండిక్లెయిన్" ప్రకటించింది. ట్రంప్‌కు ప్రతిరూపంగా ఆయన మేని రంగులోనే మలచిన సదరు విగ్రహంపై ఒక్క నూలు పోగు కూడా లేదు. ట్రంప్ నగ్న విగ్రహాన్ని చూసి జనం అవాక్కయ్యారు. సదరు విగ్రహాన్ని మన్ హట్టన్‌లోని రద్దీ ప్రాంతం యూనియన్ స్క్వేర్ వద్ద ‘ఇండిక్లెయిన్’ పేరిట జట్టు కట్టిన ఆర్టిస్టులు ఏర్పాటు చేశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న మన్ హట్టన్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి.. ట్రంప్ న్యూడిటీకి నిదర్శనంగా ఉన్న సదరు విగ్రహాన్ని వెనువెంటనే తొలగించారు. అధికారులు ఆ విగ్రహాన్ని తీసేసేలోగానే అటుగా వెళ్లిన ప్రతి ఒక్కరు ట్రంప్ నగ్న విగ్రహాన్ని కెమెరా, సెల్ ఫోన్లలో బంధించేశారు.
 
ట్రంప్‌కు తిక్కుంది.. ఐతే దానికో లెక్కుంది...
అమెరికా అధ్యక్ష పోటీలో బరిలో దిగిన దగ్గర్నుంచి నోటికి పదును పెడుతూ హాటెస్ట్ పొలిటికల్ స్టార్ అయిన డోనాల్డ్ ట్రంప్ జనవరిలో అమెరికా పీఠాన్ని అధిష్టించనున్నారు. ఐతే అయ్యగారు అప్పుడే తన ప్రణాళికలను వరసబెట్టి చెప్పేస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే చాలామంది గుండెల్లో గుభేల్ మంటోంది.
 
ప్రపంచంలో అమెరికా అంటే అదో స్టామినా, అదో లెఖ్ఖ, అదో గొప్ప స్థానం. ప్రపంచానికే పెద్దన్న అనే గొప్ప వాక్యం. ప్రపంచంలోని ఎంతమందినైనా ఆదుకోవాలంటే అమెరికానే ఆదుకోగలదనే టాక్. అలాంటిది ట్రంప్ వరుసగా పేలుస్తున్న మాటల బాంబుల దెబ్బకు అక్కడివారు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఎన్నికలకు ముందుగానే కాకుండా... ఎన్నికలు అయ్యాక కూడా ఆయన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను గద్దెనెక్కిన వెంటనే 30 లక్షల మందిని ఇంటికి పంపిస్తానంటూ బాంబు పేల్చారు. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయులను గద్దెనెక్కిన మరుక్షణమే ఇంటికి పంపిస్తానని ప్రకటించి గుబులు రేపారు. 
 
దేశంలో నేరగాళ్లు, నేరచరిత్ర ఉన్నవాళ్లు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ డీలర్లు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని, వారిని స్వదేశాలకు పంపడమో, నిర్బంధించడమో చేస్తామని తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాలోకి క్రిమినల్స్, డ్రగ్స్‌ను అరికట్టేందుకు సరిహద్దులో గోడ కట్టి తీరుతామని మరోమారు స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలా మొత్తమ్మీద అమెరికాలో కావలసినంత విమర్శనాత్మక పనులు, వ్యాఖ్యలు చేసిన ట్రంపును అమెరికా ప్రజలు అధ్యక్షుడి పీఠంలో కూర్చోబెట్టేశారు. మరి ఇపుడు ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో ఏమిటో చూడాల్సిందే. 2016లో ఆయన అలా ఉన్నారు... మరి 2017 నుంచి మారిపోతారేమో...?!!