ప్రజాశాంతిలో బాబు మోహన్.. వరంగల్ నుంచి పోటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాబు మోహన్‌ను నియమిస్తున్నట్లు పాల్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ప్రజాశాంతి పోటీ చేస్తుందని, తెలంగాణలోని వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ అభ్యర్థిగా ఉంటారని మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని పాల్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు నలుగురు ఏకనాథ్ షిండేలు ఉన్నారని పాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రులు పి.శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముగ్గురేనని ఆయన అన్నారు. అయితే అతను నాల్గవ పేరు మాత్రం పాల్ చెప్పలేదు.