శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (16:07 IST)

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

KCR
KCR
తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కె. చంద్రశేఖర్ రావు ఫోటో పోస్టింగ్ చర్చనీయాంశమైంది. కేసీఆర్ "మిస్సింగ్" అంటూ వాల్ పోస్టర్ నోటీసుతో కూడిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో  "సామాన్య జ్ఞానం లేని శక్తివంతమైన వ్యక్తి, తన స్వంత శక్తి కోసం మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. ప్రజల కష్టాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు." పోస్టర్‌లో ఇంకా ఇలా ఉంది: "ఆ వ్యక్తి పది సంవత్సరాలు అధికారం అనుభవించాడు, తెలంగాణను దోచుకున్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి దిగబడ్డాడు, అతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు, అతను తప్పిపోయాడు." అంటూ రాసి వుంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్ కొత్తేమీ కాదు. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్షనేత అంటూ వాల్ పోస్టర్లు వేశారు. అయితే ఇవన్నీ ఎక్కడా వేసినవి కాదని తెలుస్తోంది. కేవలం ఖమ్మం, తెలంగాణలో సంభవించిన వరదలతో జనం అవస్థతలు పడుతుంటే కూడా కేసీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరిగింది.