బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (15:29 IST)

చిటికెలో లక్షల రాబడి అంటే నమ్మొద్దు ... బెట్టింగ్ కూపంలో పడొద్దు : సజ్జనార్ (Video)

online betting
డబ్బు సంపాదించడం చాలా సులభం.. ఇంట్లో కూర్చొని ఆడుతూ పాడుతూ లక్షలాది రూపాయలను సంపాదించండి అంటూ ప్రకటనలు వస్తుంటాయి. ఈ ప్రకటనలను చూసి అనేక మంది మోసపోతుంటారు. ఇలాంటి వీడియోలను తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆశపడటంలో తప్పు లేదు కానీ, అత్యాశ పనికిరాదని వార్నింగ్ ఇచ్చారు. రూ.వెయ్యి పెట్టుబడిపెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చని చెబుతున్న ఓ వీడియోను షేర్ చేసి, ఈ వీడియో పూర్తిగా అబద్దమని చెప్పారు. 99 రెట్లు లాభం వస్తుందని చెబితే నమ్మి మోసపోవద్దని అన్నారు. 
 
ఇలాంటి వీడియోలతో ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లు విసిర వలలో చిక్కుకోవద్దని హితవు పలికారు. వీడియోలో చూపించిన నోట్ల కోట్లలు చూసి అత్యాశకు పోవద్దన్నారు. ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఆన్‌లైన్ బెట్టింగ్ కూపంలో పడి జీవితాలని ఛిద్రం చేసుకోకండంటూ సజ్జనార్ హితవు పలికారు. అత్యాశకు పోతే చివరకు బాధ, దుఃఖమే మిగులుతాయనే సత్యం గుర్తించాలని చెప్పారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా ముందే జాగ్రత్తగా ఉండటం ఉత్తమని వివరించారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ మాయగాళ్ళ గురించి మీకు తెలిస్తే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.