అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?
తెలంగాణలో అప్పుల బాధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకుంది. శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి ఆటో రిక్షాను కొనుగోలు చేసేందుకు తీసుకున్న అప్పు ఈఎంఐ కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివ్వంపేటకు చెందిన సంజీవ్ (34) ఆదివారం రాత్రి తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు.
ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, సంజీవ్ తన ఆటో ఈఎంఐ చెల్లించడానికి చాలా కష్టపడుతూ వచ్చాడు. ఈ ఘటనపై భార్య శ్రీకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మందా నాగులు (32) అనే వ్యక్తి వివిధ మార్గాల్లో అప్పులు చేసి కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. అప్పులు తీర్చలేక ఉరివేసుకున్నాడు.