ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (13:39 IST)

రేయ్... ఆ పిల్లని ఏమీ అనొద్దు, జాయింట్ కమిషనర్ రాసలీలలు (video)

GHMC Admin Joint Commissioner Janakiram
GHMC Admin Joint Commissioner Janakiram
స్మార్ట్ ఫోన్లు, ఆధునికత కారణంగా భార్యాభర్తల సంబంధాలు కాస్త పెడదారిన పోతున్నాయి. భార్యాభర్తల అనుబంధానికి అర్థాలు ఇప్పడు మారిపోతున్నాయి. ఉన్నత స్థానంలో వున్నా.. భార్య గుణవతి, అందంగా వున్నా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. 
 
ఇతర మహిళలతో సంబంధాలను కొనసాగించడం ద్వారా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసి అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. 
GHMC Admin Joint Commissioner Janakiram
GHMC Admin Joint Commissioner Janakiram
 
వేరే మహిళతో ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తాడని తెలిసింది.  
 
జానకిరామ్ తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని ఆరా తీయగా జానకిరామ్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్టుమెంట్‌లో ఉన్న ఇద్దరిని కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.