సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 జనవరి 2024 (10:26 IST)

భర్త హైబీపీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణం: తట్టుకోలేక భార్య ఆత్మహత్య

suicide
హైదరాబాద్ ధూల్ పేట పరిధిలో మంగళ్ హాట్ లో విషాదం చోటుచేసుకున్నది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రహీంపురకి చెందిన 36 ఏళ్ల అమన్ కుమార్ ధూల్ పేటకి చెందిన 31 ఏళ్ల అత్మితతో గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే గచ్చిబౌలిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అమన్ గత నెల 26 రాత్రి హైబీపీ వచ్చింది. దీనితో అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణంతో అస్మిత తీవ్ర మనస్థాపానికి గురైంది. 
 
గత పదిహేను రోజులుగా అతడి ఫోటోను ఎదురుగా పెట్టుకుని బాధపడుతూ వచ్చింది. ఆమెను పుట్టింటివారు తమ ఇంటికి తీసుకుని వచ్చారు. ఐతే భర్త మరణాన్ని తట్టుకోలేని అస్మిత నిన్న సాయంత్రం ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.