శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (14:30 IST)

నా భర్త అలాంటి సీన్స్ చేయమంటున్నారు.. ఆనంది

anandi
తమిళ నటి ఆనంది ప్రస్తుతం హోమ్లీ రోల్స్ చేస్తోంది. పెళ్లికి తర్వాత రొమాన్స్, బోల్డ్ సీన్స్‌కు ఆమెకు దూరంగా వుంది. పెళ్లి తర్వాత ఇలాంటివి చేయడానికి తాను సిద్ధంగా లేనందున స్క్రిప్ట్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది.
 
 అయితే ఇలాంటి సినిమాలు చేయమని తన భర్త తనను ప్రోత్సహించారని తెలిపింది. భయపడకుండా డేరింగ్ సీక్వెన్స్‌లు తీయమని చెప్పినట్లు ఆనంది వెల్లడించింది. 
 
ఆ ధైర్యంతోనే సినిమాను ఎంచుకుని ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించాను.. అని ఆనంది వివరించింది. ఆనంది తెలంగాణలోని వరంగల్‌కి చెందిన అమ్మాయి. తెలుగులో ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దీంతో చెన్నైకి మకాం మార్చింది.
 
అక్కడ కీలక రోల్స్ చేస్తూ తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. చివరికి ఆమె 2021లో సోక్రటీస్ అనే సహ-దర్శకుడిని వివాహం చేసుకుంది. శ్రీదేవి సోడా సెంటర్‌లో కూడా ఆమె సాహసోపేతమైన పాత్రను పోషించింది.