శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (23:28 IST)

గుంటూరు కారం కోసం ఎంబిబిఎస్ పరీక్షలకు డుమ్మా

Sreeleela
టాలీవుడ్‌లో అగ్రనటిగా మారింది శ్రీలీల. ఆమె డాక్టర్‌కు చదువుతోంది. ఒక వైపు సినిమాలు మరోవైపు చదువులు అంటూ అమ్మడు బిజీగా వుంటోంది. ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీలీల.. ఈ మద్య వారం రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. పరీక్షల కోసం పుస్తకాలను తిరగేసింది. అయితే అక్కడ శ్రీలీలకు కష్టాలొచ్చాయ్. 
 
శ్రీలీల తాజాగా మహేశ్ బాబుతో కలసి గుంటూరు కారం మూవీలో నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే ఎంబిబిఎస్ కోసం శ్రీలీల లీవులు అడగడంతో కంగారుపడిపోయారు. 
 
ఇలాగైతే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం కష్టమని భావించి, శ్రీలీలను సంప్రదించారట. దాంతో శ్రీలీల చదువును తాత్కాలికంగా పక్కనబెట్టి, షూటింగ్‌కు వచ్చేసిందట. అయినా ఎంబిబిఎస్‌ను వదిలిపెట్టనని, సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తాననీ శ్రీలీల ధీమాగా చెబుతోంది.