1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 మే 2025 (10:41 IST)

పెళ్లి చేసుకుంటానని ఒప్పించి గర్భం చేశాడు.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.. చివరికి మోసం

pregnant
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళపై లైంగిక దాడి చేసి, గర్భం దాల్చాడనే ఆరోపణలతో ఫిల్మ్‌నగర్ పోలీసులు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. టెక్కీ అయిన అర్చిత్ పి (28) అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం బాధితురాలితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. 
 
అర్చిత్ త్వరలోనే ఆమెను వివాహం చేసుకుంటానని ఆ మహిళకు హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ సన్నిహితంగా వున్నారు. దీంతో ఫిబ్రవరిలో, ఆ మహిళ గర్భం దాల్చడంతో, అర్చిత్ ఆమెను గర్భస్రావం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
 
ఆ మహిళ తరువాత పోలీసులను సంప్రదించి, ఆ వ్యక్తి వివాహం చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.
 
అయితే మే నెల మధ్యలో, వివాహం చేసుకుంటానని చెప్పి అర్పిత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ మళ్ళీ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అర్చిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.