సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (15:17 IST)

వివాహిత ప్రాణం తీసిన వాట్సాప్ గ్రూపు వివాదం

suicide
హైదరాబాద్ నగరంలో వాట్సాప్ గ్రూపు వివాదం ఓ విహి
త ప్రాణం తీసింది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ఉన్న ఎన్బీటీనగర్ బస్తీ పేరుతో ఏర్పాటైన రెండు వాట్సాప్ గ్రూపుల మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి పెద్దదైంది. ఈ పంచాయతీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరింది. 
 
ఎన్బీనగర్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో స్థానికంగా నివసించే జె రాజు గత నెల వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో దాదాపు 850 మంది సభ్యులున్నారు. ఎన్బీనగర్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో మరో వాట్సాప్ గ్రూపు కూడా ఏర్పడింది.
 
ఇందులో స్థానిక కార్పొరేటర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ఆమె అనుచరులున్నారు. ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద అక్రమ పార్కింగులు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటైన వాట్సాప్ గ్రూపు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ బోర్డును ఏర్పాటుచేశారు. గురువారం జెండా ఎగురవేయడానికి వచ్చిన మేయర్ విజయలక్ష్మి నోపార్కింగ్ బోర్డును కాలితో తన్నారని.. ఎదుటి గ్రూపు సభ్యులను దూషించారని పేర్కొంటూ జె. రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ గ్రూపు సభ్యుల్లో ఒకరి ఇంటిపైకి వెళ్లిన మేయర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అదే బస్తీకి చెందిన పావనిశర్మ సైతం గ్రూపులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఎన్బీనగర్ రెండో బంగ్లాదేశ్ మారబోతోందని చేసిన వ్యాఖ్యలపై కూడా మేయర్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిపైకి మేయర్ అనుచరులు రావడాన్ని పావనిశర్మ తీవ్రంగా పరిగణించారు. 
 
ేతీవ్ర మనస్థాపానికి గురైన పావనిశర్మ నిద్రమాత్రలు మింగారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు మేయర్ అనుచరులదే పూర్తి బాధ్యతని డీజీపీ, డీసీపీ, పోలీసులకు పంపిస్తున్నట్లు పావని శర్మ వాట్సాప్ గ్రూపులో పేర్కొంది. ఈ సంఘటనపై పావని శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.