ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (13:05 IST)

ఇంట్లో కాలు జారి పడ్డానని చెప్తే సాయం కోసం వెళ్లింది.. చివరికి అత్యాచారం?

rape
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్.. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరించాడు. 
 
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఎవరికైనా చెప్తే ఇదే చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి అత్యాచారానికి చేశాడు. తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.