శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (13:34 IST)

"కుమారి ఆంటీ" ఫుడ్ కోర్ట్.. సోషల్ మీడియాకు సీఎంకు థ్యాంక్స్

Kumari Aunty
Kumari Aunty
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ జిల్లాలో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్‌ను నడుపుతూ, రుచికరమైన మాంసాహార వంటకాలను అందిస్తున్న "కుమారి ఆంటీ" వీధి వ్యాపారిగా రాణిస్తోంది. అయితే ట్రాఫిక్ కారణంగా ఆమె షాపు తొలగించేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కుమారీ ఆంటీ బాగా పాపులర్ అయ్యింది. ఆమెకు నెటిజన్లు మద్దతు తెలిపారు. 
 
ఇలా కుమారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలగజేసుకున్నారు. ఆమె షాపును తొలగించవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారీ ఆంటీ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసింది. తన ఇంటర్వ్యూ కోసం వేచి వున్న యూట్యూబర్లకు థ్యాంక్స్ చెప్పింది. ఇక చాలు అంటూ వ్యాపారం చేసుకోవాలని వెల్లడించింది. 
 
ఇకపోతే.. నాలుగు రోజుల క్రితం, జనవరి 30న, ఆమె స్టాల్ వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు తరచుగా నిలబడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో దుకాణాన్ని మూసివేసి కొత్త స్థలాన్ని కనుగొనమని ట్రాఫిక్ పోలీసులు ఆమెకు చెప్పారు. 
 
కుమారి, ఆమె కుటుంబం 13 సంవత్సరాలుగా స్టాల్ నడుపుతోంది. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. ఆమె కూరలు, ఫ్రైల వీడియోలు వైరల్ కావడంతో ప్రతి మధ్యాహ్నం ఆమె స్టాల్‌కి ఎక్కువ మంది వచ్చారు. 
 
ఆసక్తికరంగా, మిలియన్ల మంది ప్రజలు ఆమె యూట్యూబ్ షార్ట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వీక్షించారు. కుమారి షాపును ఖాళీ చేయించేందుకు మంగళవారం పోలీసులు వచ్చిన వెంటనే, న్యాయం చేయాలంటూ కోరింది. దీంతో ఆమెకు సోషల్ మీడియా పుణ్యంతో సీఎం మద్దతు లభించింది. ఇంకా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తానని చెప్పారు.