శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (13:42 IST)

గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్.. హైదరాబాద్ రహస్య ప్రాంతంలో విచారణ

Johnny Master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆయన మీద పోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయ్యింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ను పోలీసులు హైదరాబాదులో తీసుకొచ్చారు. నగరంలోని రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. గోవాలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకొచ్చారు. విచారణ అనంతరం  ఉప్పరవల్లి కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు.