మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (10:26 IST)

మంచు సోదరులకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ

Manchu Manoj and Mohan Babu
మంచు సోదరులకు హైదరాబాద్ రాచకొండ సీపీ సుధీర్ బాబు గట్టివార్నింగ్ ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేశారు. ఇంటి గొడలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, ఇలా వీధుల్లో పడొద్దని, మరోమారు మారు విధులకెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు సోదరులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో అన్నదమ్ములిద్దరూ సైలెంట్‌ అయిపోయారు. మరోవైపు, వారి తండ్రి, నటుడు మోహన్ బాబు మాత్రం హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నేడో రేపో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
ఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు... రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సీపీ వారిని విచారించారు. ఈ సందర్భంగా కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
 
మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ యేడాదిపాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రూ.లక్ష పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.