శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (11:14 IST)

మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు.. మార్కెట్లోకి కొత్త రకం బీర్లు

beer
ప్రముఖ బ్రాండ్ల బీర్లు దొరక్క మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. వేసవిలో బీర్లకు బాగా డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ అనుమ‌తి పొందిందని కథనాలు వెలువడుతున్నాయి.
 
ప్రస్తుతం కింగ్ ఫిషర్, ఆర్‌సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉండగా.. కొత్త బీర్ల కంపెనీ ప‌వ‌ర్ 1000, హంట‌ర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీక‌ర్ వంటి పేర్లతో కొత్త బీర్లు అందుబాటులోకి తీసుకువస్తుందని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.