కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)
బాలీవుడ్ నటుడు సోను సూద్ హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన కుమారి ఆటీని కలిశారు. ఆమెతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుమారి ఆంటీ ప్రతి స్త్రీలో ఉండే నిశబ్దమైన శక్తికి, భీకరమైన స్థితిస్థాపకతకు నిదర్శనం.. మన మాటలు మరియు చర్యల ద్వారా ఈ అపరిమితమైన శక్తిని కలిగి ఉన్న వారిని ఆదరిద్దాం, జరుపుకుందాం, ఉద్ధరిద్దాం మరియు శక్తివంతం చేద్దాం అంటూ కామెంట్స్ చేసారు. అలాగే, కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపారు.
ఈ సందర్భంగా కుమారి ఆంటీతో సోనుసూద్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ, శాఖాహార భోజనం, మాంసాహార భోజనం ఎంత అంటూ ప్రశ్నించారు. వెజ్ మీల్స్ రూ.80, నాన్ వెజ్ మీల్స్ రూ.120 అంటూ కుమారి ఆంటీ సమాధానం చెప్పింది. మీకు అయితే ఫ్రీగా ఇస్తానంటూ చెప్పడంతో సోనుసూద్ ఎంతో సంబరపడిపోయారు. ఆ తర్వాత కుమారి అంటి ఇద్దరు పిల్లలతో కలిసి సోను సూద్ ఫోటోలు దిగారు.