జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 29వ తేదీన తెలంగాణలోని కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కొండగట్టులోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. తన 11 రోజుల వారాహి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటున్నారు.
బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.