ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

అరెయ్.. వీడి పాస్ గుంజుకుని డిపోలో ఇవ్వు.. జర్నలిస్టుకు డ్రైవర్ బెదిరింపులు (Video)

tgrtc bus driver
తెలంగాణ రాష్ట్రంలో విలేకరులకు తీవ్ర అవమానం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన బస్సు పాస్‌పై ప్రయాణం చేసేందుకు బస్సు డ్రైవర్ కమ్ కండక్టర్ అడ్డు చెప్పారు. పత్రికా విలేకరులతో వాగ్వివాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
హనుమకొండలో ఒక జర్నలిస్టు చనిపోయాడు. దీంతో అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతని స్నేహితులైన మరో నలుగురు జర్నలిస్టులు కలిసి జనగామ వెళ్లేందుకు ఆర్టీ బస్సు ఎక్కారు. దీన్ని చూసిన బస్సు కండక్టర్ కమ్ డ్రైవర్ జర్నలిస్టులను దిగిపోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒక బస్సులో నలుగురు జర్నలిస్టు మిత్రులు ఎక్కగా ఇంకా ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్. 
 
డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసే వాడిని అంటూ ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కండక్టర్ జర్నలిస్టులను బెదిరించాడు. అరేయ్ వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‍‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.