బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (09:29 IST)

మంచి దొంగ ఇలాగే ఉంటాడేమో. దొంగిలించి మీరేం బాధపడొద్దంటాడు

దొంగల్లో పరివర్తన చెందిన దొంగల గురించి మనం చాలా కథల్లో, సినిమాల్లో చదివి, చూసే ఉంటాం. కానీ అవి కథలు, సినిమాలు మాత్రమే. కాని నిజజీవితంలో ఒక తాను చేసిన పనికి చింతిస్తూనే తాను దొంగతనం చేసిన కుటుంబానికి ల

దొంగల్లో పరివర్తన చెందిన దొంగల గురించి మనం చాలా కథల్లో, సినిమాల్లో చదివి, చూసే ఉంటాం. కానీ అవి కథలు, సినిమాలు మాత్రమే. కాని నిజజీవితంలో ఒక తాను చేసిన పనికి చింతిస్తూనే తాను దొంగతనం చేసిన కుటుంబానికి లేఖ రాసి మరీ ఓదార్చటం వింత గొలుపుతోంది. పైగా నగలు, నగదు పోగొట్డుకున్నందుకు బాధపడవద్దు. ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు అని ఆ దొంగ ఉత్తరం రాసి పెట్టి మరీ చోరీకి దిగిపోతే ఎలాగుంటుంది. ఈ ప్రత్యేక తరహా దొంగకు సినిమా అవకాసాలు కల్పించి రైటర్‌గా పెట్టుకుంటే ప్రేక్షకులు ఫిదా అయిపోవలసిందే. 
 
వివరాల్లోకి వెళితే  నిజామాబాద్‌లో బుధవారం రాత్రి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. విశేషం ఏమిటంటే ‘మీ ఇంట్లో బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతున్నాం.. బాధపడకండి, ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు’ అని లేఖ రాసి పెట్టి మరీ చోరీకి పాల్పడిన ఉదంతంతో జనం విస్తుపోతున్నారు. 
 
నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన సురకుట్ల భాస్కర్‌ తండ్రి చిన్నయ్య ఇటీవల మృతి చెందాడు. ఆర్యనగర్‌లో ఉంటున్న భాస్కర్‌  అత్తగారు అతడిని బుధవారం నిద్ర కోసం తీసుకెళ్లారు. దీంతో నాందేవ్‌వాడలోని తన ఇంటికి తాళం వేసి భాస్కర్‌ భార్యాపిల్లలతో కలిసి అత్తగారింటికి వెళ్లగా.. రాత్రి తాళం తొలగించిన ఓ దొంగ బీరువాలో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు.. రూ. 28 వేల నగదును ఎత్తుకు పోయాడు.
 
వెళ్తూ వెళ్తూ ఓ చీటి రాసి పెట్టి వెళ్లాడు. అందులో ‘మీ బంగారం ఎత్తుకుపోతున్నాం బాధపడవద్దు.. దేవుడు మీకు ఇంకా ఇస్తాడు.. మీరు చూస్తూ ఉండండి’ అని రాశాడు. గురువారం ఉదయం వచ్చిన భాస్కర్‌ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ రాసిన చీటిని స్వాధీనం చేసుకున్నారు.
 
ఎంత మంచి దొంగో.. నగలు, నగదు పోయాయని ఎక్కడ వాళ్లు కుప్పగూలిపోతారో అని భావించి  లేఖ రూపంలో కౌన్సిల్‌ కూడా ఇచ్చి మరీ వెళ్లాడు. బాధపడకండి, ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు. ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప ఓదార్పు మాటను  గానీ లేఖను గానీ మీరెక్కడయినా చూశారా?