బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (11:19 IST)

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో యువతుల కారు బీభత్సం

నిన్న అర్థరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసముండే ఉషాభాగ్య అనే యువతి తన స్నేహితురాళ్లు అనితారెడ్డి, తరుణాసింగ్, సోనమ్ సింగ్‌తో అర్థరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించార

నిన్న అర్థరాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసముండే ఉషాభాగ్య అనే యువతి తన స్నేహితురాళ్లు అనితారెడ్డి, తరుణాసింగ్, సోనమ్ సింగ్‌తో అర్థరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వైపునకు అతి వేగంతో దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంలో స్కూటీపై వెళ్లే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
మితిమీరిన వేగంతో వచ్చిన కారు డివైడరును ఢీకొని బోల్తాకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తాపడ్డ కారులో ఇరుక్కున్న నలుగురు యువతుల్ని స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. యువతులు డ్రంకన్ డ్రైవ్ చేశారేమోనన్న అనుమానంతో పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. మద్యం తాగలేదని తేలింది. అతివేగం.. అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.