గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (09:24 IST)

సోమవారం తెల్లవారుజామున కుమ్మేసిన వర్షం .. ఎక్కడ?

rain
హైదరాబాద్ నగరంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కుమ్మేసింది. అమీర్ పేట, పంజాగుట్ట, బంజారా హిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చాంద్రాయణ గుట్ట, శాలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్‌‍లో ఏకంగా 4.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అంబర్‌పేట్, శేరిలింగంపల్లి, శివరాంపల్లిలలో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
 
కాగా, తెల్లవారుజామున హఠాత్తుగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాహదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 
 
రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.