సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 20 డిశెంబరు 2016 (13:28 IST)

జయలలితకు వారసులు లేరంటారా? పిటీషనర్‌కు హైకోర్టు రూ.1,00,000 జరిమానా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వపరం చేయాలంటూ దాఖలైన పిటీషన్ పైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విచారణ చేపట్టింది. జయలలితకు వారసులు లేరని పిటీషనర్ పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలితకు సోదరుడు ఉన్నారు కదా అని చెప్పిన హైకోర్టు పిటీషనర్ వాదనను తోసిపుచ్చింది.
 
అంతేకాకుండా జయకు వారసులు లేరు అని పిటీషన్ వేసినందుకు పిటీషనర్ కు రూ.1,00,000 జరిమానా విధించింది. జయలలితకు సోదరుడు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో జయ సోదరుడి కుమార్తె దీప అన్నాడీఎంకె శశికళపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి తమిళనాడులో జయ వారసులపై అక్కడి కోర్టులు ఏమంటాయో చూడాలి.