శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (09:16 IST)

మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ : ఓ ఏఎస్ఐ నిర్వాకం

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల ఆర్మ్డ్ ఫోర్స్‌

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ చేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల ఆర్మ్డ్ ఫోర్స్‌కి చెందిన ఏఎస్‌ఐ ఒకరు తన విభాగంలో పనిచేస్తున్న మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నారు. 
 
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ భాస్కర్‌ ఆ వీడియోలను పరిశీలించారు. 
 
అందులోని పరిసరాలను బట్టి ఆ బాగోతం కార్యాలయంలోనే జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అలాగే సాయుధ విభాగంలో ఏం జరుగుతోందన్న కోణంలో విచారణకు ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వ్యక్తిగతంగా విచారించి పూర్తి వివరాలతో ఎస్పీకి నివేదిక సమర్పించారని తెలిసింది.