శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో నేడు రేపు వడగళ్ళ వానలు

తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో వడగళ్ళ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణాలోకి బలంగా గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావం కారణంగా నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
అలాగే, వాయువ్య ప్రాంతాల్లో గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేసమయంలో గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్ర చాలా మేరకు తగ్గింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.