షూటింగ్ పూర్తి చేసుకున్న 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'
నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకుని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించిన ఈ నిర్మాణ సంస్థలో ప్రస్తుతం రూపొందుతోన్న చిత్రం 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమెటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.
పాండిచ్చేరిలో చిత్రీకరించిన 'ఎన్నోఎన్నో వర్ణాల హరివిల్లె చెలి కళ్లై విలసిల్లే...' పల్లవితో సాగే పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రముఖ గీత రచయిత సాహితి రచించిన ఈ పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ నత్యాల్ని సమకూర్చారు. పాండిచ్చేరిలో హీరో శర్వానంద్, హీరోయిన్ నిత్యామీనన్‌లపై ఈ మెలోడీ పాటను అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. త్వరలోనే ఆడియో, సినిమాని విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె.యస్.రామారావు మాట్లాడుతూ '' మా బ్యానర్‌లో వస్తున్న మరో బ్యూటిఫుల్ యూత్ లవ్ స్టోరి. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేసే చిత్రం. శర్వానంద్, నిత్యామీనన్ వంటి వెర్సటైల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడం హ్యపీగా ఉంది. పాండిచ్చేరిలో అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది.
సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మలయాళంలో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన గోపిసుందర్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. క్రాంతిమాధవ్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో ఆడియో, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
శర్వానంద్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: గోపిసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్ వి.యస్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: క్రాంతిమాధవ్.