శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (14:14 IST)

ధర్మరాజుగా నాగార్జున.. ద్రౌపదిగా ఐశ్వర్యారాయ్.. భీష్ముడిగా అమితాబ్!

భారత మహామహులైన నటీనటులతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ దర్శకుడు శ్రీకుమారన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం మహాభారత కథతో సాగుతుంది. 
 
ఈ చిత్ర కథ ప్రధానంగా భీముని పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో ధర్మరాజు పాత్రకు అక్కినేని నాగార్జునను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. ఇక భీముడిగా మలయాళ నటుడు మోహన్ లాల్, అర్జునుడిగా తమిళ హీరో విక్రమ్ నటిస్తుండగా, ద్రౌపది పాత్రకు ఐశ్వర్యారాయ్‌ని తీసుకుంటున్నారు. 
 
ఇక మరో కీలక పాత్ర భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ నటిస్తాడట. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వాసుదేవనాయర్ మహాభారతకథపై రాసిన 'రెండు మూలం' ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తారట.