శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (12:40 IST)

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

ramgopal varma
ramgopal varma
ఆడువారు మాటలకు అర్థాలే వేరులే.. అనే నానుడి ఎప్పుడు పుట్టిందో కానీ కేవలం మహిళలను ద్రిష్టిలో పెట్టుకునే ఉపయోగిస్తుంటారు. ఈ పేరుతో వెంకటేష్ హీరోగా సినిమా కూడా వచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ మాటలు పై నానుడికి కరెక్ట్ గా సరిపోతుంటాయి. ఎందుకంటే వారు చెప్పేదానికి చేసేదానికి పొంతనే వుండదు.  అందులో గొప్ప దర్శకులుగా పేరుతెచ్చుకుని కిందిస్థాయికి పడిపోయిన రామ్ గోపాల్ వర్మకు కరెక్ట్ గా సరిపోతుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
మొదటి సినిమా శివ సమయంలో వర్మ గురించి ఎవరికీ తెలియదు. శివ సినిమా కథను, వర్మ టేకింగ్ ను నాగార్జున నమ్మి సినిమా తీశాడు. వర్మ మా నాన్న అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడల్లా. సౌండ్ సిస్టమ్ లో కొత్త పోకడలు రావాలని చూసేవాడు. హాలీవుడ్ సినిమాల ప్రేరణ ఎక్కువగా వుండడంతో దాని ప్రభావంతో క్లోజ్ షాట్స్ తో సినిమా తీయడం మొదటుపెట్టి ఎందరికో గురువు అయ్యాడు.
 
 
కాలక్రమేణా మంచి సినిమాలు తీసినా, క్షణం క్షణం సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నాడు. ఇక గోవింద గోవింద సినిమా తీసి తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు తీసి తెలుగులో ఇక్కడ సరైన గుర్తింపు లేదని బాలీవుడ్ వెళ్ళిపోయాడు. ఇకపై తెలుగులో సినిమా తీయనని స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. అక్కడ మాఫియా డాన్ లపై సినిమాలు తీసి కొత్త పోకడలు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మరలా యూ టర్న్ తీసుకుని తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అదేమని అడిగితే నా మాటను నాకు అనుగుణంగా మార్చుకుంటానని సెలవిచ్చాడు.
 
అలా ఆ తర్వాత ఫ్యాక్షనిస్టు, రౌడీ కథలు, రాజకీయ నాయకుల జీవిత కథలు తీసి ప్లాప్ లు తెచ్చుకున్నారు. మధ్య మధ్యలో బయపెట్టే దెయ్యం, భూతం, మర్రిచెట్టు వంటి  సినిమాలు తీసిన ఆయన మరలా రాజకీయ నాయకుల జీవితాలను వెలుగులో తెచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. వంగవీటి సినిమా తీసి అన్నీ అబద్దాలే చెప్పాడు. తీసే నిర్మాత చూసే ప్రేక్షకుడు వుంటే ఏదైనా చెప్పవచ్చు అనే రూల్ ను పాలో అయ్యేవాడు.
 
ఆ తర్వాత స్వంత బేనర్ స్థాపించి కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నట్లు చెప్పి ఓ యువ దర్శకుడిని ఎంకరేజ్ చేసి కొంత షూట్ చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమోకానీ దాన్ని అటకెక్కించాడు. ఆ యువ దర్శకుడు ఒకప్పటి వర్మ క్లాస్ మేట్ కావడం విశేషం. ఫ్రెండ్ కొడుకునే ఇలా చేశాడేమిటని కొందరు అడిగితే.. ఆయన మారాడు అనుకోవడం మా భ్రమ అంటూ వర్మ ఆఫీసులో పోకడలు ఏకరువు పెట్టారు కూడా.
 
ఇక ఇప్పుడు కొత్త టాలెంట్ కోసం ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ ప్రవేశ పెట్టాడు. దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలింస్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపికచేశాం. నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చాయి గానీ అవి షార్ట్ లిస్ట్ కాలేదు. షార్ట్ లిస్ట్ అయిన వాటిని సోషల్ మీడియాలో పోల్ కు పెట్టి ప్రేక్షకులు ఎక్కువమంది బెస్ట్ డైరెక్టర్ గా ఓటు వేసిన వారికి మా సంస్థలో అవకాశం ఇస్తాం. ఎవరికైనా మొదటి అవకాశం దొరకడం ముఖ్యం ఆ తర్వాత వాళ్లను వాళ్లు ప్రూవ్ చేసుకుని కెరీర్ లో  ముందుకెళ్లాల్సిఉంటుంది వర్మ తెలిపారు.
 
అయితే మీలో టాలెంట్ తగ్గి కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్నారా? అని ప్రశ్న వర్మ ముందుకు వచ్చింది .దానికి ఆయన సరైన సమాధానం చెప్పకుండానే... దాటవేస్తూ, నేను ఏది చేసినా దానిని చూసేవారు చూస్తారు. నేను బలవంతంగా చూడమని చెప్పడం లేదు కదా? అంటూ పాత పాటపాడారు. పైగా నేేను చెప్పేవన్ని నిజాలనుకుంటే మీ అమాయకత్వం అంటూ ట్విస్ట్ కూడా ఇచ్చారు. అందుకే ఆడువారి మాటలకు అర్థాలే  వేరులే అనే సూక్తి వర్మకు కరెక్ట్ గా సరిపోతుంది అని ఇండస్ట్రీ టాక్. 
 
ఇక రేపు భావి తెలుగు దర్శకులు, రచయితలను వెలుగులోకి తెస్తానన్న వర్మ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారినుంచి కథలు తీసుకుని భవిష్యత్ లో తన కథలుగా సినిమాలు తీస్తాడనే టాక్ కూడా ప్రబలంగా వినిపిస్తోంది.