శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:28 IST)

ఒళ్లు కొవ్వెక్కి బూతులు రాస్తున్నారు.. వెబ్‌సైట్ నిర్వాహకులపై హేమ ఫైర్

వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు బూతులు రాస్తున్నారని నటి హేమ మండిపడింది. కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సా

వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు బూతులు రాస్తున్నారని నటి హేమ మండిపడింది. కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సామాన్యులపై కూడా ఇలాంటి రాతలు రాస్తున్నారని.. అలాగే ఫేస్ బుక్‌లోనూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నాపని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని ప‌క్కన ఇది క్లిక్ చేయండంటూ అశ్లీల వీడియోలు, రాత‌లు ఉంటున్నాయ‌ని హేమ చెప్పుకొచ్చింది. 
 
కాగా న‌టుల‌పై వ‌స్తోన్న గాసిప్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన హేమ‌... ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్ట‌డం వ‌ల్ల అమ్మాయిలు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నార‌ని చెప్పింది. సినీ నటులే కాదు.. అన్నీ వర్గాల మహిళలపై కూడా వెబ్ సైట్ నిర్వాహకులు ఈ పని చేస్తున్నారని చెప్పింది. వెబ్ సైట్ నిర్వాహకులను ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి రాతలు రాస్తున్నారని.. ఎక్కడెక్కడో వుంటూ వార్తల్ని వెబ్ సైట్లలో పోస్టులు చేస్తుంటారని తెలిపింది.