శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:55 IST)

టీవీ నటి దివ్యను పెళ్ళాడనున్న తమిళ నిర్మాత సురేశ్‌

నటి దివ్యను తమిళ సినీ నిర్మాత ఆరే.సురేశ్ వివాహం చేసుకున్నాడు. 'సలీమ్', 'ధర్మదురై', 'అట్టి' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌కే.సురేశ్‌ 'తారైతప్పట్టై' చిత్రం ద్వారా నటుడిగా అవతారమెత్తారు.

నటి దివ్యను తమిళ సినీ నిర్మాత ఆరే.సురేశ్ వివాహం చేసుకున్నాడు. 'సలీమ్', 'ధర్మదురై', 'అట్టి' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌కే.సురేశ్‌ 'తారైతప్పట్టై' చిత్రం ద్వారా నటుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో విలన్‌గా రాణించిన ఈయన ఆ తర్వాత 'మరుదు' చిత్రాల్లో నటించి తాజాగా హీరోగా మారి 'తనీముఖం', 'బిల్లాపాండి', 'వేట్టైనాయ్‌' చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
అదేవిధంగా మెగా సీరియల్‌ 'సుమంగళి'తో నాయకిగా ప్రాచుర్యం పొందిన నటి దివ్య, 'లక్ష్మీవందాచ్చి' సీరియళ్లలోనూ నటించారు. ఈ నేపథ్యంలో నటి దివ్యను సురేశ్ పెళ్ళి చేసుకోన్నాడు. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం తాజాగా జరిగింది. వీరిద్దరూ నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ కాబోయే దంపతులు శనివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. 
 
తమది పెద్దల నిశ్చయించిన పెళ్లి అని, దివ్యను వివాహమాడటం సంతోషంగా ఉందని సురేశ్‌ తెలిపారు. ప్రస్తుతం నటుడు శరత్‌కుమార్‌కు జంటగా 'అడంగాదే' చిత్రంలో నటిస్తున్నానని, వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పనున్నట్లు దివ్య వెల్లడించింది.