బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (12:37 IST)

వర్షం కోసం పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు.. భార్యాపిల్లల ఎదుటే...

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణ దేవుడి కరుణాకటాక్షాల కోసం వివిధ రకాల పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, వర్షం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణ దేవుడి కరుణాకటాక్షాల కోసం వివిధ రకాల పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, వర్షం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు. అదీకూడా వారివారి భార్యలు, పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రంలోని ఇండోర్‌‌లో రమేష్ సింగ్ తోమర్ వద్ద సక్రామ్‌ ఆశీర్వార్‌, రాకేశ్‌ అద్జన్‌‌లు అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరుణదేవుడు అనుగ్రహించాలంటూ కప్పలు, కుక్కలకు పెళ్లిళ్లు చేసినా ఫలితం లేకపోవడంతో లోకకల్యాణార్థమై వర్షాలు కురవాలంటూ సక్రామ్, రాకేష్‌లు వివాహం చేసుకున్నారు.
 
ఈ పురుషుల వివాహతంతును చూసేందుకు భారీ ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉత్సాహం చూపించారు. పెళ్లితంతు సమయంలో మబ్బులు పట్టిన ఆకాశం చివరికి ఒక్క చినుకు చుక్క కూడా రాల్చకుండానే కనుమరుగైంది. దీంతో స్థానికులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.